ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం కలిగిందని చెప్పారు. ఆ రోజు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. 12 న్నర సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించానని వాపోయారు. అవినీతి పరురాలినని కేసులలో ఉన్నానని ప్రతిపక్షాలు ఎన్నో విధాలుగా ప్రచారాలు చేశాయని.. దానికి తాను ఎంతో బాధపడ్డానన్నారు.
READ MORE: CM Himanta: కాంగ్రెస్ ఎంపీ భార్యకు పాక్ ఆర్మీతో మంచి సంబంధాలు..
కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు 14 ఏళ్ల విచారణ తర్వాత తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి పీఏ మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌ను కూడా దోషులుగా తేల్చింది. కాగా, వీరందరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది.
READ MORE: Cabinet Meeting: భారత్-పాక్ ఉద్రిక్తత.. రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ..