Harish Rao: దుబాయ్ టూర్‌పై రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారు
- దుబాయ్ టూర్‌పై రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారు
- మాజీ మంత్రి హరీశ్‌రావు క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్‌టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
దుబాయ్ టూర్‌పై అబద్ధాలు..
నేను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. నా మిత్రుడి కూతురు పెళ్లి వేడుకకు వెళ్లాను. నేను ఫిబ్రవరి 21వ తేదీన దుబాయ్‌కి వెళితే 22 ఉదయం ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరిగింది. అయినా ప్రభుత్వంలో ఉన్న మీరు రెస్క్యూ పనులు చేయాలి. కానీ మమ్ములను అంటే ఎలా? గతంలో కూడా కాళేశ్వరం విషయంలో ఇలాగే మాట్లాడారు. మాకు అప్పగించండి చేసి చూపిస్తాం అంటే తోక ముడిచారు. ఇప్పుడు కూడా మీ వల్ల కాదు అంటే చెప్పండి.. మేము రెస్క్యూ చేసి చూపెడతాం. పది రోజులు అయినా డెడ్ బాడీలు ఇంకా బయటకు తీయలేదు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత కచ్చితంగా డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించాలి. మేము వెళితే టన్నెల్ వరకు రానీయలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు వెళితే మాత్రం దగ్గరుండి చూపించారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటన విషయంలో ముఖ్యమంత్రికి సీరియస్‌నెస్ లేదు. అందుకే వనపర్తి రాజకీయ కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీ వెళ్లారు. ఈ విషయాలు అన్ని అసెంబ్లీలో ఎండగడతాం.’’ అని హరీశ్‌రావు తెలిపారు.
Also Read
ఇది కూడా చదవండి: PM Modi: గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మోడీ సఫారీ.. ప్రకృతిని కాపాడాలని పిలుపు
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!