కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పని చేశారు. డి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు.
Jagadish Reddy: 'ఖమ్మం-నల్గొండ-వరంగల్' పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి.. మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు.
Death Celebrations Invitation: సాధారణంగా ఎవరైనా పెళ్లికి లేదా గృహ ప్రవేశానికి లేదా పుట్టినరోజు వేడుకలకు శుభలేఖలు ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేస్తుంటారు. కానీ ఎవరైనా మరణాన్ని ముందుగా అంచనా వేసి వేడుకలకు రావాలంటూ ఆహ్వానం పంపించడం చూశారా. కానీ ఏపీలోని ఓ మాజీ మంత్రి మాత్రం తన మరణవేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు. తన మరణదిన వేడుకలను ఘనంగా చేసుకుంటున్నానని, అందరూ తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రిక ఇస్తుంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.…
అమ్మాలపై అఘాయిత్యాలు జరకుండా అధికారులు ఎన్నో పకడ్బంది చర్యలు చేపట్టిని ఎక్కడో ఒక చోటు వారి పై అత్యాచారాలు, లైంగికదాడులు జరుగుతూనే వున్నాయి. కానీ ఓ మాజీ మంత్రి కూడా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో.. అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ.. విద్యార్ధిని పై లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులో…
సీఎం జగన్ లాభాపేక్షకు విద్యారంగం నాశనమైందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ జవహర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధేమిటో అర్థమైందని ఆయన మండిపడ్డారు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులంతా వేలి ముద్రగాళ్లు అవ్వబట్టే, రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైందని, చంద్రబాబు బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే, జగన్ వచ్చాక 10శాతం…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని ఆయన వెల్లడించారు. 1983లో అతి చిన్న వయస్సు ఎమ్మెల్యేను నేనని, జీవితంలో మరిచిపోలేని సంఘటనలు ఉన్నాయన్నారు. 1985లో మరోసారి ఎన్నికలు వచ్చాయి. రెండేళ్ళ లోనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఖర్చులు ఉంటాయని ఎన్టీఆర్ కు చెబితే.. నా భుజం మీద చేయి వేసి ఫోటో దిగారు. ఈ…
కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గతేడాది మాజీ మంత్రి రాసలీలల సీడీ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి మీద బెంగళూరులో కేసుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విచారించిన స్పెషల్…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై వైసీపీ నేతలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. నెల్లూరును విడదీయవద్దని మేము ఎప్పుడో చెప్పామని, వైసీపీ నేతలు ఒక్కొరు ఒకో విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని కలిసే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కానీ సంబరాలు చేసుకుంటున్నారని, కొందరు నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని…