చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది. గత బుధవారం అమెరికాలోని ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుండగా దుండగుడు జరిపిన తుపాకీ కాల్పులకు కుప్పకూలి ప్రాణాలు వదిలారు.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ (31) హత్య అమెరికాను కుదిపేసింది. ట్రంప్‌కు అత్యంత దగ్గర మనిషిగా పేరుగాంచిన చార్లీ కిర్క్ హత్యకు గురి కావడంతో అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఓ దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కేథలిక్ పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8, 10 వయసు గల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
అగ్ర రాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ లక్ష్యంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు లభించింది.. సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు ప్రదానం చేయనుంది.. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు అవార్డు దక్కింది.. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో అవార్డు ప్రదానం చేస్తారు.. ఈ ముఖ్యమైన వేదిక అయిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025 కు 138 దేశాల నుంచి ప్రముఖ పోలీసు అధికారులు ఒకేచోట సమావేశమవుతున్నారు.
Tesla Cars: అమెరికాలో ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ కొందరు టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, లాస్ వేగాస్‌లో టెస్లా కార్లపై దాడులు చేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. రాత్రిపూట లాస్ వేగాస్ స్వీస్ సెంటర్‌లో టెస్లా వాహనాలకు నిప్పంటించారు.
Kash Patel: అమెరికా నిఘా సంస్థ ‘‘ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(FBI)’’ తొమ్మిదవ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారత మద్దతుదారులకు కీలక పదవులు కట్టబెట్టారు.
భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాష్ పటేల్ ఎఫ్బీఐకి తొమ్మిదవ డైరెక్టర్. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పటేల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో US అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రిస్టోఫర్ వ్రే తర్వాత తొమ్మిదవ FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను US సెనేట్ ధృవీకరించిన విషయం తెలిసిందే.…