అగ్ర రాజ్యం అమెరికాలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. నార్త్ కరోలినాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులకు పాల్పడాలని ఐసిస్ కుట్ర చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 18 ఏళ్ల క్రిస్టియన్ స్టర్డివాంట్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం.. రన్‌వేను దాటుకుని..!
ఈ కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసిందని యూఎస్ డీవోజే తెలిపింది. ప్రస్తుతం కస్టడీలో యువకుడిని విచారిస్తున్నారు. అతడి దగ్గర నుంచి చేతితో రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న మేటర్ ప్రకారం విచారిస్తున్నారు. కత్తి, సుత్తి దాడులకు ప్లాన్ చేసినట్లుగా డీఓజే పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడాలని భావించినట్లుగా అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
నిందితుడు క్రిస్టియన్ స్టర్డివాంట్ నార్త్ కరోలినాలోని మింట్ హిల్స్ వాసి. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో నిత్యం రహస్యంగా మంతనాలు జరిపినట్లుగా అధికారులు కనిపెట్టారు. డిసెంబర్ 18న ఐసిస్ నుంచి దాడులకు సంబంధించిన సంకేతాలు అందినట్లుగా అధికారులు కనుగొన్నారు.
చేతితో రాసిన నోట్ ప్రకారం దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. జనవరి 7 వరకు కస్టడీలో అధికారులు విచారించనున్నారు. నోట్‌లో దాదాపు 20 మంది వరకు కత్తితో పొడవాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. దాడి అనంతరం ‘అమరవీరుడు’గా చనిపోవాలని లేఖలో రాసి ఉంది. ఇక సోదాల్లో రెండు కత్తులు, సుత్తులు స్వాధీనం చేసుకున్నారు. భారీ కుట్రను భగ్నం చేయడంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అధికారులను అభినందించారు.