Tesla Cars: “టెస్లా” లక్ష్యంగా అమెరికాలో దాడులు.. లాస్ వేగాస్‌లో కార్లకు నిప్పు..
- టెస్లా లక్ష్యంగా అమెరికాలో దాడులు..
- లాస్ వేగాస్‌లో కార్లకు నిప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla Cars: అమెరికాలో ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ కొందరు టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, లాస్ వేగాస్‌లో టెస్లా కార్లపై దాడులు చేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. రాత్రిపూట లాస్ వేగాస్ స్వీస్ సెంటర్‌లో టెస్లా వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో చాలా కార్లు తగలబడిపోయినట్లు తెలుస్తోంది. టెస్లా కొలిషన్ సెంటర్‌లో జరిగిన దాడిలో కనీసం 5 కార్‌లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదనికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Read Also: Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన అందమైన సముద్ర జీవులు.. (వీడియో)
Also Read
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
అధికారుల ప్రకారం.. నేరస్తుడు మోలోటోవ్ కాక్‌టెయిల్స్‌ని ఉపయోగించి, వాహనాలకు నిప్పటించినట్లు తెలుస్తోంది. బిజినెస్ సెంటర్ ముందు తలుపులపై ‘‘రెసిస్ట్’’ అనే పదాన్ని కూడా రాశాడు. ఎఫ్‌బీఐ జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ , లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కలిసి నేరస్థుడిని గుర్తించడానికి పనిచేస్తున్నాయి. నిందితుడు పూర్తిగా నల్లటి బట్టలు ధరించి, కార్ల మధ్యలో నడుస్తున్నట్లు గుర్తించారు. మంటలు వాహనాల బ్యాటరీలను చేరుకునే లోపే ఫైర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది.
ఈ ఘటనను ‘‘ఉగ్రవాదం’’గా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పిలిచారు. ఈ హింసాత్మక సంఘటన చాలా తప్పు అని అన్నారు. టెస్లా కేవలం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది, ఈ దుష్ట దాడులకు అర్హమైనవి కావు అని అన్నారు. మరోవైపు, టెస్లా ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేయడాన్ని దేశీయ ఉగ్రవాదంగా వర్గీకరించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరారు. అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండీ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఇవి దేశీయ ఉగ్రవాదం కన్నా తక్కువ కాదని అభివర్ణించారు.
This level of violence is insane and deeply wrong.
Tesla just makes electric cars and has done nothing to deserve these evil attacks. https://t.co/Fh1rcfsJPh
— Elon Musk (@elonmusk) March 18, 2025
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..