అమెరికా ఎఫ్‌బీఐ దృష్టిలో దశాబ్దాలుగా కంటిలో నలుసుగా ఉన్న మోస్ట్ వాంటెడ్, సీనియర్ హిజ్బుల్లా కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాది హతమయ్యాడు. మంగళవారం రాత్రి తూర్పు లెబనాన్‌లో ఇంట్లోకి రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి వెలుపల ఉండగా ఈ కాల్పులు జరిగాయి. ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే హమాది మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు లెబనాన్ వార్తాపత్రిక అల్ అఖ్బర్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ.. సర్కార్ నిర్ణయం
అయితే ఈ హత్య వెనుక ఉన్న ఉద్దేశం అయితే బయటకు రాలేదు. అయితే దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ కలహాలు కారణంగా ఈ హత్య జరిగినట్లుగా స్థానిక మీడియా కథనాలు పేర్కొ్న్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఏదైనా గ్రూప్ ఈ దాడికి పాల్పడిందా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అన్నది ఇంకా తేలలేదు.
హమాది దశాబ్దాలుగా ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. ఓ ఉగ్రదాడిలో ఇతడి ప్రమేయం ఉందన్న కారణంతో ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. 1985లో అనేక మంది అమెరికన్లతో సహా 153 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న లుఫ్తాన్స ఫ్లైట్ 847ను పశ్చిమ జర్మన్ విమానాన్ని హైజాక్ చేశాడు. హైజాకింగ్ సమయంలో ఒక అమెరికన్ జాతీయుడ్ని చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. ఇందులో హమాది ప్రమేయం ఉన్నట్లుగా తేల్చారు. దీంతో యూఎస్.. వాండెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది.
ఇది కూడా చదవండి: Ajay Maken: కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 382 కోట్ల కుంభకోణానికి పాల్పడింది..