అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఓ దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కేథలిక్ పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8, 10 వయసు గల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగుడు తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: TG Rains: రాబోయే నాలుగు గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల వారు జాగ్రత్త!
ఎఫ్‌బీఐ ప్రకారం.. మిన్నియాపాలిస్‌లోని అనౌన్సియేషన్ కాథలిక్ స్కూల్‌లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది చిన్నారులు గాయపడ్డారని పేర్కొంది. అనంతరం దుండగుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పింది. ఇది దేశీయ ఉగ్రవాద చర్య అని.. అంతేకాకుండా ద్వేషపూరిత నేరంగా ఎఫ్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లుగా స్పష్టం చేసింది. కేథలిక్కులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లుగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Google Maps: గూగుల్ మ్యాప్‌ను నమ్మితే నట్టేట ముంచింది.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు!
పాఠశాలలో ప్రార్థన కోసం పిల్లలంతా హాజరైనప్పుడు కాథలిక్ చర్చి కిటికీలోంచి దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇది పూర్తిగా అర్థం చేసుకోలేనిదిగా ఉందని మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ మీడియాతో అన్నారు.

ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరం అన్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల గురించి పూర్తి సమాచారం తనకు అందినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ త్వరగా స్పందించి సంఘటనాస్థలికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అలాగే వైట్‌హౌస్ కూడా పరిస్థితిని సమీక్షిస్తుందని ట్రంప్ తెలిపారు.
Updates on the shooting in Minneapolis, Minnesota:
The FBI is investigating this shooting as an act of domestic terrorism and hate crime targeting Catholics.
There were 2 fatalities, an 8-year-old and a 10-year-old. In addition, 14 children and 3 adults were injured.
— FBI Director Kash Patel (@FBIDirectorKash) August 27, 2025
