భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాష్ పటేల్ ఎఫ్బీఐకి తొమ్మిదవ డైరెక్టర్. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పటేల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో US అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రిస్టోఫర్ వ్రే తర్వాత తొమ్మిదవ FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను US సెనేట్ ధృవీకరించిన విషయం తెలిసిందే. పటేల్ నియామకానికి అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. ఇద్దరు డెమోక్రాట్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
Also Read:unni mukundan: శృంగార సన్నివేశాలకు మొహమాటం లేకుండా నో చెప్పేస్తా..
ప్రమాణ స్వీకారం తర్వాత, FBI లోపల, వెలుపల జవాబుదారీతనం ఉంటుందని నేను హామీ ఇస్తున్నానని పటేల్ అన్నారు. FBI డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కాష్ పటేల్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాష్ పటేల్‌కు తన సపోర్టు ఎప్పుడు ఉంటుందని తెలిపాడు. ఆయనను కఠినమైన, బలమైన వ్యక్తిగా అభివర్ణించారు. “నేను కాష్ (పటేల్)ను ఇష్టపడటానికి, అతన్ని ఈ పదవికి ఎంపిక చేయడానికి గల కారణం ఏజెంట్లకు అతని పట్ల గొప్ప గౌరవం ఉంది” అని అన్నారు. FBI డైరెక్టర్ గా ఆ పదవిలో అత్యుత్తమ వ్యక్తిగా నిలిచిపోతారని అన్నారు.
Also Read:Cigarette Price Hike: స్మోకింగ్ లవర్స్ కి షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు!
కాష్ పటేల్ కుటుంబం వడోదరకు చెందినది. కాష్ పటేల్ రిచ్మండ్ యూనివర్సిటీ నుంచి హిస్టర్, క్రిమినల్ జస్టిస్‌లో డిగ్రీ పొందారు. అలాగే పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జేడీ అందుకున్నారు. ఫ్లోరిడాలో పబ్లిక్ డిఫెండర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలంలో కాష్ పటేల్ కీలక పదవులను నిర్వహించారు. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంపై FBI దర్యాప్తులో పక్షపాతం ఉందని ఆరోపిస్తూ వివాదాస్పద GOP మెమోను రూపొందించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.