Kash Patel: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నియామకాన్ని ప్రకటించారు. భారత మూలాలు ఉన్న కాష్ పటేల్‌ని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించారు. కాష్ పటేల్ ట్రంప్‌కి సన్నిహిత మిత్రుడు, మాజీ జాతీయ భద్రతా సహాయకుడు. ప్రస్తుతం చీఫ్ క్రిస్టోఫర్ వ్రే స్థానంలో కాష్ పటేల్ ఎఫ్‌బీఐ చీఫ్ కానున్నారు. ‘‘పటేల్ ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు మరియు 'అమెరికా ఫస్ట్' పోరాట యోధుడు, అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని రక్షించడం మరియు అమెరికన్…
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన డిబేట్ లో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో ఇండియన్ స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారతీయ- అమెరికన్ల బృందం న్యాయ శాఖతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ), పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికా మట్టిని ఉపయోగిస్తోందని చెప్పారు. కాలిఫోర్నియాలో హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసుల సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశమైంది.
Most wanted: అమెరికాలో నాలుగేళ్ల క్రితం 29 ఏళ్ల భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఆమె కోసం అక్కడి ఏజెన్సీలు వెతుకుతున్నాయి. తాజాగా ఎఫ్‌బీఐ తన మోస్ట్ వాంటెడ్ లిస్టులో భారతీయ మహిళ పేరును చేర్చింది. FBI అధికారులు ఈమె జాడను తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు.
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది, భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో భారత ప్రమేయం ఉందని, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికన్ పౌరుడైన పన్నూని హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, అతనికి ఓ భారత ప్రభుత్వ ఉద్యోగితో సంబంధాలు ఉన్నాయని అమెరికా న్యాయశాఖ నేరాభియోగ పత్రంలో పేర్కొంది. అయితే అమెరికన్ పౌరుడిని, అమెరికన్ గడ్డపై హత్య చేయడానికి ప్లాన్ చేయడాన్ని బైడెన్ ప్రభుత్వం…
FBI warned US Khalistani elements: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఇప్పుడు ఈ హత్య కెనడా, ఇండియా మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే , భారత్ కూడా దెబ్బకు దెబ్బ…
విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న 14 ఏళ్ల బాలిక పట్ల ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దుప్పటి మెడ వరకు కప్పుకుని హస్త ప్రయోగం చేశాడు. అతడు భారత సంతతికి చెందిన డాక్టర్ సుదీప్త మొహంతి అని గుర్తించారు.
ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు గురైన నేపథ్యంలో గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదే సమయంలో హత్యపై దర్యాప్తులో సహాయం చేయాలని ఎఫ్‌బిఐని కోరారు. 59 ఏళ్ల జర్నలిస్ట్, అవినీతి వ్యతిరేక క్రూసేడర్ ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు సంబంధించి ఆరుగురు కొలంబియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
John Kaczynski: తన నేరాల ఆధారంగా అమెరికాను షేక్ చేసిన థియోడర్ జాన్ కాజిన్స్కీ 81 ఏళ్ల వయసులో మరణించారు. వృద్ధాప్యానికి గురైన కాజిన్స్కీ సెల్‌లోనే మరణించాడు.
అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన USB ఛార్జింగ్ పాయింట్ల గురించి పలు సూచనలు తెలిపింది.