Charlie Kirk Murder: చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల.. వయస్సు ఎంతంటే ..!
- చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల
- కాలేజీ వయస్సు ఉంటుందని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ (31) హత్య అమెరికాను కుదిపేసింది. ట్రంప్‌కు అత్యంత దగ్గర మనిషిగా పేరుగాంచిన చార్లీ కిర్క్ హత్యకు గురి కావడంతో అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక్క తూటాకే సంఘటనాస్థలిలో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. పేలుడు శబ్దానికి గందరగోళం చెలరేగడంతో ప్రేక్షకులంతా తలోవైపు పారిపోయారు.
ఇది కూడా చదవండి: Crime News: షాకింగ్ మర్డర్స్.. భార్య, ప్రియుడి తలలు నరికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త!
Also Read
ఇక కేసును ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే చార్లీ కిర్క్‌పై కాల్పులు జరగగానే గందరగోళం చెలరేగింది. దీంతో నిందితుడు కూడా చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. అయితే తాజాగా నిందితుడికి సంబంధించిన ఫొటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. కాలేజీ వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఫొటోల్లో నిందితుడు చాలా చిన్నవాడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిందితుడిని ఇంకా పోలీసులు పట్టుకోలేదు. ప్రస్తుతం నిందితుడికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే హంతకుడు ఉపయోగించిన రైఫిల్‌ను మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు గురువారం ఎఫ్‌బీఐ తెలిపింది. శక్తివంతమైన రైఫిల్‌గా గుర్తించారు. అందుకే ఒక్క తూటాకే చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Off The Record: అక్కడ టీడీపీలో గ్రూపుల గోల..! కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిందా..?
ఫొటోలో నిందితుడు బేస్ బాల్ క్యాప్, సన్ గ్లాసెస్ ధరించి ఉన్నాడు. భవనంలో మెట్ల దారిలో వెళ్తున్నట్లు కనిపించాడు. ఒక నల్ల బ్యాక్ ప్యాక్‌ను పట్టుకుని అమెరికన్ జెండా ముద్రించిన చొక్కా ధరించి కనిపించాడు. అనుమానితుడికి సంబంధించిన నాలుగు చిత్రాలను ప్రస్తుతం అధికారులు విడుదల చేశారు. ఇక క్యాంపస్‌లో సీసీటీవీలో రికార్డైన నిఘా ఫుటేజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ఎఫ్‌బీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.
తుపాకీపై అడిగిన ప్రశ్నకు బదులిస్తుండగానే తూటాకు బలి..
తుపాకీ సంసృృతిపై అడిగిన ఓ ప్రశ్నకు చార్లీ కిర్క్ బదులిస్తుండగా తూటా దూసుకొచ్చింది. ఒక్క తూటాకే ప్రాణాలు కోల్పోయాడు. చార్లీ కిర్క్… రిపబ్లికన్ పార్టీకి మద్దతుదారుడు. ఇక యూనివర్సిటీలో కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలతో ఫిర్యాదు చేశారు. కానీ యూనివర్సిటీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు.
#WATCH | Orem, Utah (The US): FBI and Utah Department of Public Safety hold a press briefing on the assassination of Charlie Kirk.
Beau Mason, Commissioner of the Utah Department of Public Safety, shares video and images of the suspect, seeking help from the public in… pic.twitter.com/eSKwVsfWfB
— ANI (@ANI) September 12, 2025
తాజావార్తలు
-
SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
-
Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!
-
AP Municipal Elections 2026: సవరించిన షెడ్యూల్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు!
-
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!
-
HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!