కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మానాయక ఫంక్షన్ హల్ లో కేంద్రం వడ్లు కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ. అనంతరం పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కేంద్రం ఎఫ్…
ఈదేశంలో ప్రతి వస్తువుకి గరిష్ట చిల్లర ధర (MRP) వుంటుంది. కానీ, రైతుల పంటలకు మాత్రం ధర లభించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, నాణ్యత పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. తమకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిట్టుబాటు ధర రాక కందుల రైతులు తలలు పట్టుకుంటున్నారు. 42 వేల ఎకరాల్లో…
తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను వర్తింపజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, రాష్ట్రంలోని 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌శాఖ.. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని కోరింది.. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు అయినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లింది ఎక్సైజ్ శాఖ.. గంజాయి సాగు చేస్తున్న వీరికి రైతు బంధు నిలిపివేయాలని…
జిల్లాల పునర్విభజన ఆ మంత్రులిద్దరికీ తలనొప్పులు తెస్తోందా? విపక్షాల విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు.. సీఎంకు ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారా? తరుణోపాయం తోచడం లేదా? ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రులెవరు? జిల్లా విభజన మార్పుకోసం మంత్రులపై ఒత్తిళ్లుప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇద్దరిలో ఒకరు సీఎం జగన్‌కు దగ్గరి బందువు.. మరొకరు ఆయనకు ఆత్మీయంగా ఉండే సహచరుడు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రకాశం జిల్లా మూడు ముక్కలైంది.…
మూడు రాజధానులు, అమరావతి అంశంపై హైకోర్ట్ కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఇప్పటికే రాజకీయపార్టీలు స్పందించాయి. తీర్పుని స్వాగతించారు సీపీఐ నేత రామకృష్ణ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల స్పందించారు. రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ముందు నుంచి టీడీపీ మూడు రాజధానుల బిల్లు చెల్లదని చెబుతూనే ఉంది.వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళింది. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు…
నాబార్డ్ వార్షిక ప్రణాళికపై బుధవారం ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ సహకరిస్తోందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాబార్డ్, బ్యాంకులు సహాయం చేశాయని సీఎం జగన్ గుర్తు చేశారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ…
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. కౌలు రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిది.కాయకష్టం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మీ సహా ప్రభుత్వ పథకాలేవీ వర్తించకపోవడం అన్యాయం. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం కూడా కౌలు రైతులకు లేకపోవడం దారుణం. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఏ ఒక్క…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 32 రోజుల పాటు, 506 కిలోమీటర్ల దూరం పాద యాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరిట ఈ పాద యాత్ర ప్రారంభం అయ్యింది.మొదటి రోజు పాదయాత్ర ను ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా దేవాలయంలో పూజలు చేసి అనంతరం యాత్రను చేపట్టారు. యడవెల్లి, మాధాపురం, కట్టకూర్, మేడేపల్లి, యడవెల్లి…
తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత. రైతులు…
ఏపీలో సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరును సమీక్షించారు. కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. వెసులుబాటు ఉన్నంత…