వరిసాగు కంటే ప్రత్యామ్నాయం చూపించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం కలెక్టరేట్లో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్బీకే వ్యవస్థ కొత్తగా రావడంతో ప్యాడీ ప్రొక్యుర్‌మెంట్‌లో గ్యాప్ వచ్చిందన్నారు.. రైతులకు ఈక్రాప్ విశయంలో అవగాహనా లోపం ఓ కారణమన్న ఆయన.. గత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సమస్య రావడానికి కొత్త వ్యవస్థే కారణం అన్నారు.. అయితే, రాబోయే ఏడాది ఎలాంటి సమస్య ఉండదని భరోసా…
వరంగల్ హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయి. మే 6వ తేదీన జరిగే సభ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అన్నారు ప్రజలంతా టీఆర్ఎస్ పాలనపై అసహనంతో వున్నారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందన్నారు. ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి…
కేసీఆర్ అసమర్థపాలనపై మండిపడ్డారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఎందుకివ్వడం లేదన్నారు. డీపీఆర్ లేకుండా నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్డీఎస్‌పై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది ? కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది..? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు,…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ కోతలు తప్పడంలేదని చెబుతున్నారు.. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరిపోతోంది.. అయితే, వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో కోతలు మొదలయ్యాయి.. నిన్న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.. ఇక, రాత్రిపూట సింగిల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా చేయనున్నారని సమాచారం.. ఈ మేరకు జిల్లాల వారీగా త్రీఫేజ్ విద్యుత్‌కు సంబంధించి షెడ్యూల్‌ను అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది..…
మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు..…
అనంతపురం జిల్లా మన్నీల రచ్చబండ లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రైతు నేపథ్యం నుంచి వచ్చా… రైతు కష్టం తెలిసిన వాడిని.కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లేక… గిట్టుబాటు కాక నిరాశ నిస్పృహ లో ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి… లక్షల కోట్లు ఉంటే ఏమి లాభం? కౌలు రైతు, రైతులకు కులం ఉండదు. ఒకప్పుడు నేను ఇంటర్ లో బాగా…
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది.. ఈ సారి ఏకంగా అర్వింద్ ఇంటిని ముట్టడించారు రైతులు.. ఆర్మూర్‌లోని అర్వింద్ నివాసం ముందు వడ్లను పారబోసి నిరసన చేపట్టారు రైతులు.. జిల్లా నలుమూలనుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు.. బీజేపీ నేతలు చెబితేనే వరి వేశాం.. కాబట్టి ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాల…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం…