Nadendla Manohar : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు.. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.…
Rain Alert In AP: దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Minister Nadendla: బాపట్ల జిల్లాలోని చెరుకు పల్లె మండలం నడింపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది.
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.
Anam Ramnarayana Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. జగన్కు రైతులపై అకస్మాత్తుగా ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రైతుని కూడా పరామర్శించలేదన్న ఆయన.. మొంథా తుఫాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, తుఫాను సమయంలో ప్రభుత్వం చక్కగా పని చేసిందని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని తెలిపారు. అయితే ఉనికి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ సుడిగాలులు( వాటర్ స్పౌట్) బీభత్సం సృష్టించాయి. పలిమెల మండలంలోని లెంకలగడ్డలో గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో సుడిగాలుల ఏర్పడడంతో భారీగా చెట్లు ,మిర్చి, పత్తి పంటలు నెలకొరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రకృతి విలయతాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో…
YS Jagan: మొంథా తుఫాన్ ఏపీలో విధ్వంసమే సృష్టించింది.. కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలిసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పంట నష్టంపై ఆరా తీశారు.. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సాయం అందిందని అడిగి తెలుసుకున్న ఆయన.. కూటమి సర్కార్పై ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో రైతు పరిస్థితి తెలుసుకోవాలంటే గ్రౌండ్ లోకి తిరిగి చూస్తే అర్థం అవుతుంది.. ఈ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, నిర్దయగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు.. గోదావరి జిల్లాల నుంచి…
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 7337359375 కు “HI” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. 2025–26 ఖరీఫ్ పంట సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు,…
Siddipet Taravva : సిద్దిపేట జిల్లాలో తారవ్వ అనే మహిళా రైతు పంట నష్టపోయిందంటూ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న ఘటనపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ సంఘటన మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తారవ్వ పంటను పూర్తిగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా తారవ్వ అకౌంట్లో పంట మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశారు. కేవలం…
CM Chandrababu: రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతి 15 రోజులకు రాజధాని పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.. కొన్ని సంస్థలు.. వర్క్ ఫోర్స్.. మెషినరీ.. పూర్తి స్థాయిలో కేటాయించలేదన్నారు.. ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగు పరుచుకోవలని సూచించారు.. ఇక, రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. త్వరలో రాజధాని రైతులతో…