కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోలేదు. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి తీవ్రతరం కావడంతో రైతులు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లారు. అయితే, ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్లారు.…
రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో డీఏపీ సంచికి రూ. 500గా ఉన్న సబ్సిడీని రూ.1200కు పెంచింది కేంద్రం. ఈ సబ్సిడీ కోసం రూ. 14,775 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా…
డీఏపీ ధరలు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్రభుత్వం ఇవాళ రైతులకు అనుకూలంగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరలను భారీగా పెంచేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్.. అదే సమయంలో.. పెరిగిన భారాన్ని రైతులపై మోపకుండా సబ్సిడీ రూపంలో తామే భరిస్తామని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర సర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్ ధర రూ. 1,700 ఉండగా.. రూ.…
వరంగల్ లో జాతీయ రహదారిని దిగ్బంధించారు రైతులు.. వరంగల్ రూరల్ వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ లో పోసిన ధాన్యం 15 నుండి 20 రోజులు గడుస్తున్నా పట్టించుకోవడంలేదని జాతీయ రహదారి 563 పై ధర్నా చేపట్టారు రైతులు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కాంటాలు అయ్యేలా పరిష్కరించాలని రైతులు కోరారు. మార్కెట్ సెక్రటరీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడని రైతులు ఆందోళన చేపట్టారు. స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ రైతులతో మాట్లాడి ధర్నా…