కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు వైఎస్సీర్టీపీ అధినేత వైఎస్ షర్మిల. యాదాద్రి జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మోత్కూర్ మాట ముచ్చటలో షర్మిల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 46లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుకుంటూ పోతున్నారు. కేసీఆర్ ఇచ్చేది రెండువేల పెన్షన్ మాటే కానీ దేనికి సరిపోవడంలేదు. నిత్యావసరాల ధరలు భగ్గు మనిపిస్తున్నారు.
అప్పు లేని రైతు అప్పులేని కుటుంబం లేదు. తెలంగాణ లో రైతు బంధు అని ఐదువేలు ఇస్తున్నాడు. ఎరువుల సబ్సిడీ లేదు. పంట నష్టం పరిహారం మాటలేదు. వరి కూడా వేసుకోవద్దు అంటాడు. పంట కొనేది లేదు అని తెగేసి చెప్పి రైతులను కోలుకోకుండా చేశాడన్నారు షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారు. నీళ్లను ఎత్తి పోస్తున్నాం అని ఆఖరికి సముద్రంలోనే కలుపుతుండు.
ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. వడ్లు కొనే బాధ్యత ఎవరిది? ఓట్లు వేసింది ఎవరికి? కేసీఆర్ మాటలను నమ్మి రెండుసార్లుగెలిపిస్తే రైతుని బానిసల్ని చేశాడు. లక్ష90 వేల ఉద్యోగాలు ఉంటే అందులో 90వేల ఉద్యోగాల్లో 30 వేలు భర్తీచేస్తానన్నాడు. పిల్లల కోసమైనా ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పేవాడు సరిగా లేడు. చదువు లేదు, రుణమాఫీ లేదు. ఎవరైనా ఆలోచిస్తున్నారా మంచోడు మంచోడు అంటే మంచం కాళ్ళు ఎత్తుకు పోయాడన్నట్టుగా తయారయ్యాడు.
తెలంగాణ పేరు మీద ఇంటికో ఉద్యోగం అన్నాడు .. కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఒక్కో కుటుంబం మీద 4 లక్షల అప్పు వుందన్నారు షర్మిల. కుటుంబానికి 2లక్షల రూపాయలు ఇవ్వాలి ఇచ్చాడా లేదు డబ్బులన్నీ వాళ్ళ జేబులోకి పోయినాయి. కాంగ్రెస్ పార్టీ కి ఓట్లేస్తే పశువులను కొన్నట్టు కొన్నాడు. రాజకీయ వ్యభిచారం కదా ఇది. కేసీఆర్ చేతుల్లో రెండుసార్లు మొసపోయాం. ప్రతి పక్షాలు ప్రభుత్వాలు ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయి. మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డను తెలంగాణ ప్రజల బ్రతుకులు మార్చడంకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి మీ ముందుకు వచ్చింది ఆశీర్వదించండి అన్నారు వైఎస్ షర్మిల.