Israel: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాం.. ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇరాన్‌కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రం అవుతోంది. గత శనివారం జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని యూఎస్, ఇజ్రాయిల్ చంపేశాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలను ఇరాన్ చేపట్టింది. ఖమేనీ వారసుడిగా ఆయన కొడుకు కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ మిలిటరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మద్దతు ఖమేనీ కుమారుడు మొజ్తాబాకు ఉంది.
కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఎన్నికైన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ హెచ్చరిక జారీ చేసింది. ‘‘కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాము’’ అని చెప్పింది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కాట్జ్ సోషల్ మీడియా పోస్టులో..‘‘ ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, యునైటెడ్ స్టేట్స్ మరియు స్వేచ్ఛా ప్రపంచాన్ని మరియు ఈ ప్రాంత దేశాలను బెదిరించడానికి మరియు ఇరాన్ ప్రజలను అణచివేయడానికి ఇరాన్ ఉగ్రవాద పాలన నియమించిన ఏ నాయకుడైనా తాము నిర్మూలిస్తాం’’ అని అన్నారు.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
అతడి పేరు ఏదైనా కావచ్చు, ఎక్కడ దాక్కున్నా తాము వదిలేది లేదని హిబ్రూ భాషలో పోస్ట్ చేశారు. ఈమేరకు సమర్థవంతంగా పనిచేయాలని ఇజ్రాయిల్ సైన్యం(ఐడీఎఫ్)ను కాట్జ్ ఆదేశించినట్లు తెలియజేశారు. ఇరాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కావాల్సిన అనువైన పరిస్థితుల్ని సృష్టించడానికి అమెరికన్ మిత్రులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
మంగళవారం రాత్రి ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఇరాన్ ఎక్స్‌పర్ట్ అసెంబ్లీ రివల్యూషనరీ గార్డ్స్ ఒత్తిడితో ఖమేనీ కుమారుడు మోజ్తాబాను తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది. 36 ఏళ్ల ఇరాన్‌ను పాలించిన ఖమేనీని ఇజ్రాయిల్, యూఎస్‌లు వైమానిక దాడిలో హతమర్చాయి. ఈ దాడిలో ఖమేనీతో పాటు టాప్ జనరల్స్‌తో పాటు ఉన్నతాధికారులు మరణించారు. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించింది. ఖమేనీని తన సొంత ఊరు మషాద్‌లో ఖననం చేయనున్నట్లు సమాచారం.
כל מנהיג שימונה ע"י משטר הטרור האיראני כדי להמשיך ולהוביל את התוכנית להשמדת ישראל, לאיים על ארה"ב והעולם החופשי ומדינות האזור, ולדכא את העם האירני – יהיה יעד חד משמעי לחיסול.
לא חשוב מה שמו והמקום בו יסתתר.
רה"מ ואני הנחינו את צה"ל להיערך ולפעול בכל האמצעים למימוש המשימה כחלק…
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) March 4, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?