F-15 Shot Down: యూఎస్ F-15 యుద్ధవిమానాలు ఎలా కుప్పకూలాయో తెలిసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
F-15 Shot Down: యూఎస్, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. మరోవైపు, ఇరాన్ ప్రతీకార దాడుల్ని కూడా పెంచింది. గల్ఫ్ దేశాలైన యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్, సౌదీలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేస్తోంది. అబుదాబీ, దోహా, రియాద్, దుబాయ్ సిటీల్లోని కీలక ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. ఇదే కాకుండా, ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కీలకంగా ఉన్న చమురు క్షేత్రాలపై దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని యూఎస్ మిలిటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకుంది.
ఇదిలా ఉంటే, సోమవారం అమెరికాకు చెందిన మూడు F-15 యుద్ధవిమానాలు కుప్పకూలిపోవడం సంచలనంగా మారింది. అయితే, మిత్రదేశమైన కువైట్ పొరపాటున కూల్చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. కువైట్‌కు చెందిన F-18 విమానం మూడు F-15 విమానాలను పొరపాటును కూల్చేసిందని వెల్లడించింది. F-18 హార్నెట్ పైలట్ పొరపాటున మూడు క్షిపణులను మూడు అమెరికా జెట్లపై ప్రయోగించగా, అవి కువైట్ గగనతలంలో కూలిపోయాయి.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
Read Also: Adil Rashid History: టీ20 అంతర్జాతీయాల్లో ఆదిల్ రషీద్ అరుదైన చరిత్ర!
ఇరాన్‌పై అమెరికా ‘‘ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ మొదలుపెట్టిన తర్వాత ఇది అగ్రరాజ్యానికి మొదటి భారీ నష్టంగా చెప్పవచ్చు. కూలిపోయిన మూడు యుద్ధవిమానాలు F-15E స్ట్రైక్ ఈగిల్స్. ఇవి ఇరాన్ దాడి వల్ల కాదని, మిత్రదేశం కువైట్ పొరపాటు వల్ల కూలిపోయినట్లు తేలింది. అయితే, ఇందులో సిబ్బంద పారాశ్యూట్ల సాయంతో సురక్షితంగా జెట్స్ నుంచి బయటపడ్డారు. కాగా, ఈ మూడింటిని మేమే కూల్చేశామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన పరిస్థితులు ఇంకా తెలియరాలేదు.
మరోవైపు మార్చి 1న కువైట్‌లోని శుఐబా పోర్ట్ వద్ద ఉన్న అమెరికా టాక్టికల్ ఆపరేషన్స్ సెంటర్‌పై ఇరాన్ చేసిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికన్ సైనికులు మరణించారు. మూడు విమానాలు కూలిపోయిన ఘటనపై పెంటగాన్ స్పందించింది. అయితే, ఇది ఇరాన్ కూల్చివేయలేదని, మిత్రదేశం వల్లే జరిగిందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ చెప్పారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!