కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులకు కరెంట్ కోతలు విధించటం ఎరువుల ధరలు పెంచటం లాంటి పలు రైతాంగ సమస్యలను మీ దృష్టి కి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. రైతు లేనిది రాజ్యం లేదు ఒక రైతు ఆరు నెలలు కష్టపడితేనే మనం అన్నం తింటాం నెలతల్లిని నమ్ముకుని కష్టపడి బ్రతికే రైతన్నలకు ప్రభుత్వాలు చేయుతనివ్వాలి కానీ వారికి భారంగా మారకూడదు.
ఇప్పటికే వడ్లు కొనుగోలు విషయంలో రైతులు గందరగోళం లో ఉన్నారు ఈ పరిస్థుల్లో కరెంట్ కోతలు విధించి రైతులను ఇంకా బాదపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం…ఈ కోతలతో చేతికొచ్చిన పంట నీరు అందక ఎండిపోతుంటే రైతు కళ్లలో నుండి కన్నీరు కారుతుంది. పట్టణ ప్రాంతాలకు 24 గంటలు కరెంట్ ఇస్తూ రైతులకు కోతలు విధించటం సబబు కాదు అవసరం అనుకుంటే పట్టణ ప్రాంతంలో 2 గంటలు కోత విధించి రైతాంగానికి మేలు చేయండి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు వారీగా 35 మిలియన్ యూనిట్లు రికార్డ్ కాగా 5 మిలియన్ యూనిట్లు కోత విధించారు. ఇలా కోతలు విధించటం మూలన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు..రైతులను 24 గంటల కరెంట్ కి అలవాటు చేసి ఇలా పంట చేతికొచ్చే సమయంలో కోతలు విధించడం ఏంటి..? మరో వైపు ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి విపరీతంగా రేట్లు పెంచటం వలన రైతులకు ఎరువులు పెను భారంగా మారాయి….266 వందలు ఉన్న యూరియా పై 50 రూపాయలు పెంచారు అలాగే 28-28-28 మరియు 17-17-17 ఇంకా 14 – 13- 14 ఎరువులు 1474 ఉండగా 1900 చేసి ఏకంగా 425 రూపాయలు పెంచారు..అలాగే పోటాష్ ధర 885 ఉండగా 1700 చేసి ఒకేసారి 815 రూపాయలు పెంచారు. ఇలా ఓ వైపు ఎరువుల ధరలు పెంచుతూ కరెంట్ కోతలు విధిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నేలతల్లి ని నమ్ముకుని బ్రతుకున్న రైతన్నలు ఇలా వేదించటం సరికాదు రైతన్నలు ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ఇలా కక్ష సాధించడం న్యాయం కాదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.