రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిన కొన్ని రోజులకే సంయుక్త సమాజ్ మోర్చా ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. SKM కింద 32 ప్రధాన రైతు సంఘాలు పోరాటం చేశాయి. ఇందులో 22 సంఘాలు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తు కష్టం కాబట్టి… ఆమ్ ఆద్మీ…
కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంను వ్యాపార రంగంగా చూడకూడదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన హరీష్ రావు మాట్లాడుతూ… దేశానికి అన్నం పెడుతూ.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. అటువంటి వ్యవసాయంను దండగ అనే స్థితి నుంచి కేసీఆర్ నేడు పండుగగా మార్చారు. పదేళ్ల క్రితం గంజీ కేంద్రాలను పెట్టిన…
ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తున్నది.ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం. అదనంగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచాం అన్నారు మంత్రి పీయూష్ గోయల్. 20 లక్షల…
ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. Read Also: సోషల్‌మీడియా సాయంతో ఆర్టీసీ సమస్యలకు చెక్ ధాన్యం తీసుకోకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై నెపం నెట్టివేయాలని కేంద్రం చూస్తోందని ఆయన…
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. తిరుపతిలో ఈరోజు అమరావతి రైతు మహాసభ జరిగింది. ఈ సభకు ప్రతిపక్షాలు హాజరయ్యాయి. కాగా, అమరావతి సభపై వైపీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ కోసం జరిగిన కాదని, క్యాపిటలిస్టు కోసం జరిగిన పాదయాత్ర అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమపై దండయాత్ర చేసినట్లు పాదయాత్ర చేశారని, విశాఖ…
రైతుల మహాపాదయాత్ర ముగింపు సభ ఈరోజు తిరుపతిలో జరిగింది. ఈ సభలో రైతులతో పాటుగా ప్రతిపక్షాలు కూడా పాల్గొన్నాయి. తిరుపతిలో జరిగిన మహా పాదయాత్ర ముగింపు సభపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని అన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యామాన్ని నడిపిస్తోందని అన్నారు. నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, తోక పార్టీలను…
రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. ఆ పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు బ్యాంక్ అకౌంట్లలో జమవుతూ వస్తాయి. దీనితో ఆర్థికంగా రైతులకు భరోసా కలుగుతుంది. మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. ఇప్పటికే 9 విడతల డబ్బులు వచ్చాయి.…
తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు.…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి, ఇతర ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ జరిపారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. విశాఖను పెట్టుబడులకు వేదికగా మలుచుకోవాలన్న సీఎం ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్నారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి.…