రైతు బీమా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది రైతులు ఉంటే.. కేవలం 32 లక్షల మందికి మాత్రమే బీమా చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 34 లక్షల మంది రైతులకు భీమా వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విన్నవించారు… అయితే, దీనిపై విచారణ…
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రేపు రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్… రేపు ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేయబోతున్నారు.. రాష్ట్రంలోని…
వ్యాపారరంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు రూరల్ ఇండియాపై దృష్టి సారించారు. రూరల్ ఇండియాలో రైతులు పండించిన పంటను చిన్న చిన్న వాహనాలపై ఓవర్ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తుంటారు. డిమాండ్ ఉన్న వాహనాల్లో పంటను పెద్ద ఎత్తున ఓవర్ లోడ్ చేసుకొని వెళ్తుంటారని, ఓవర్ లోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రూరల్ ఇండియాలో డిమాండ్ ఉన్న వాహనాలను ఓవర్ లోడ్కు తగిన విధంగా మార్పులు చేయాలని, డిజైన్…
వరంగల్ రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల మోసంపై ఆగ్రహం వ్యక్తం చేవారు. దీంతో ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఏనుమాముల మార్కెట్లో ఉదయం మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు తేజ మిర్చికి రూ.17,200గా ధర నిర్ణయించారు. అనంతరం రూ.14 వేలలోపు ధరలు నిర్ణయిస్తూ కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక కాంటను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాధేయపడగా..…
తనకు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఒక యువ రైతు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఆత్మహత్యకు చేసుకుంటానని మంత్రి కేటీఆర్ కు రైతు శ్రీను ట్వీట్ చేశాడు. తాను ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగం లేకపోవడంతో తన భూమిలో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నానన్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలలో తనకున్న 5 ఎకరాల భూమిని అధికారులు పల్లె వనం పేరుతో బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించారని రైతు అంటున్నాడు. తన భూమికి తనకివ్వాలని…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం రోజు విడుదల చేసింది… ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది.. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ పోలింగ్ ప్రారంభం కాబోతోంది.. అయితే, ఎన్నికలకు ముందు సామాన్యులకు, రైతులకు భారీ ఊరట కలిగించేలా శుభవార్త వినిపించింది యోగి…
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్లోని తన కార్యాలయంలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ పై నిప్పులు చెరిగారు.కేసీఆర్కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల అన్నారు.…
రైతులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం.. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది.. మూడో విడతలో మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేయనున్నారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. Read Also: సీఎం జగన్ హస్తినబాట.. ప్రధానితో భేటీకి ప్రాధాన్యత..! 2021–22 సీజన్లో…
గడచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మృదంగం మోగుతుందని అధికారికంగానే నిత్యం ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న…
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… రైతుబంధు సొమ్మును రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్.. రేపటి నుంచి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ జరగనుంది.. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి.. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ కానున్నాయి.. ఇక, డిసెంబర్ 10వ తేదీ నాటికి…