హుజురాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాల్లో వేగం, వేడి పెరుగుతోంది. మంగళవారం హుజురాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద స్కీంలకు ఇందిరానగర్- శాలపల్లి కేంద్రంగా మారిందన్నారు. శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైందని, ఈ స్కీం మొదటి ఇక్కడే లాంఛ్ చేయలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారని గుర్తు చేశారు. దళితబంధు నేను వద్దన్నట్లు దొంగ ఉత్తరం…
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరవుతోంది. ప్రచారానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. పట్టుమని పది రోజులే మిగిలాయి. ఈ లోగా చేయాల్సిందంతా చేసే పనిలో ఉన్నారు నేతలు. ప్రచార ఉధృతి పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దసరా సంబరాలు ముగిశాయి. కానీ హుజూరాబాద్‌లో ఇంకా ముగిసినట్టు లేదు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం దసరాలాగే ఉంది. మరో…
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ నేనే ఇప్పించిన, గెలవడానికి నేనే వెళ్లి ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన కూడా…
హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… నేను మధ్యలో వచ్చి మధ్యలో పోలేదు. సమైక్య పాలనలో ఎన్ని అవమానలు భరించాం. పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఎక్కడ అడిగిన ఈటెల కు కేసీఆర్ ద్రోహం చేసిండు అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ఎమ్ వస్తుంది అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ప్రగతి భవన్ నుండి బయటికి వస్తాడు. నిరుద్యోగ భృతి వస్థలేదు. అడిగితే నన్ను పార్టీ నుండి బయటికి పంపాడు. వందల కోట్లు నా మీద నన్ను…
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఎక్కడి వాడో వచ్చి మన ఊర్లలో మన బొడ్రాయి దగ్గర ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అభివృద్ధి చెయ్యలేదు అని అంటున్నారు. బ్రోకర్ గాళ్ళు, పని చేయని వారు వచ్చి మాట్లాడుతుంటే మీరు కూడా విని ఊరుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్నారు. ఈ ఊరికి రోడ్డు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే వేయించిన. చిన్న ఊరి వారికి కూడా పెద్ద బ్రిడ్జి…
పచ్చటి సంసారంలో సైతం కేసీఆర్ చిచ్చు పెడతారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ పుడితే టీఆర్ఎస్‌లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. ఉద్యోగాలు పీకేస్తాం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. వీటికి ఇచ్చే డబ్బులు…
ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలుగు వారినే కాదు ఢిల్లీని కూడా ఆకర్షిస్తోంది. ఈ హైవోల్టేజీ ఎన్నికను టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే కంటే కేసీఆర్ వర్సెస్ ఈటల అంటే బాగుంటుందేమో. నిజానికి హుజూరాబాద్ ప్రజలు అలాగే పరగణిస్తున్నారు. పైగా ఈ ఉప పోరును ఒకరిపై ఒకరికి ద్వేషంతో చేస్తున్న పోరుగా చూస్తున్నారు. ఎలా మొదలైందో కానీ.. మొత్తానికి ఆట మొదలైంది. అయితే ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఇప్పటికి ఇప్పుడు చెప్పటం…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు…
మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి…