వీణవంక గడ్డ ఇచ్చిన చైతన్యంతోనే కేసీఆర్ ప్రజావ్యతిరేక పనుల మీద గర్జించిన అని ఈటల రాజేందర్ అన్నారు. ఐకేపీ సెంటర్స్ పెట్టాలని డిమాండ్ చేసిన. నర్సంపేట, పెద్దపల్లి ఎమ్మెల్యే లు, మంత్రి హరీష్ రావు ఈ మండలంలో తిరుగుతున్నారు. ఇక్కడే మీటింగ్ పెట్టి నన్ను విమర్శించారు. కేసీఆర్ పంతం పడితే హరీష్ పని చేస్తున్నారు. హరీష్ అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ నీ ఆటలు ఈ గడ్డ మీద సాగవు అని తెలిపారు ఈటల. ఇక 70 కోట్ల…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జోరు పెంచింది. పీసీసీ అధ్యక్షుడు హుజురాబాద్ నియోజవకర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం జీడీపీ పెంచుతామంటే దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతారనుకున్నామని.. కానీ జీ అంటే గ్యాస్.. డీ అంటే డీజిల్.. పీ అంటే పెట్రోల్ ధరలు పెంచుతారని మేమేం ఊహించలేదంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు. అంతేకాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎందుకు బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనితో పాటు…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రోజురోజుకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరూరా ఈటల రాజేందర్ కు ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఈటల గెలుపు తథ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, హుజురాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం…
హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారని ఆరోపించారు కేటీఆర్.. అన్ని ఆధారాలున్నాయని.. ఉప ఎన్నికలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్…
అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల సోలోగా ఉప ఎన్నిక బరిలో దిగుతారని, సొంత పార్టీ పెడుతారంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. దీంతో ఈటల ఒంటిరిగా పోరాడుతాడనుకున్న గులాబి నేతలకు షాక్ తగిలినట్లైంది.…
కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామి ఇచ్చారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ఆపరేటర్స్‌కు రూ.10లక్షల రుణాలు బ్యాంకుల ద్వారా అందింస్తామని తెలిపారు. మేడారం జాతరను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కిషన్‌రెడ్డి, మేడారం జాతర గురించి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రచారం చేస్తామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, అభివృద్ధి…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వడమే కాకుండా సంచలనంగా మారుతుందన్న విషయం తెలిసిందే. నిజానికి వివాదాలతోనే ఆయన సినిమాలకు హైప్ క్రియేట్ చేసి పబ్లిసిటీని పెంచుకుంటారు. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సినిమాను ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరంటూ అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆర్జీవీ. Read Also : పారితోషికం…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుంకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అన్నప్పటినుంచి అక్కడే ఉంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలను టీఆర్ఎస్ కు ఓట్లు వేసేందుకు వివిధ వరాలను గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం మాడిపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలవనే గెలవదు.. గెల్చినా ఈటల మంత్రి అయ్యేది ఉందా.. నియోజకవర్గ పనులు చేసేది…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… ఈటల ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటి వరకు చెప్పలేదు. హుజురాబాద్ అభివృద్ధి పై ఇప్పటి వరకు ఈటల మాట్లాడటం లేదు. నీ సమస్య నీబాధ నియోజకవర్గం ప్రజల మీద రుద్దుతావ అని ప్రశ్నించారు. హుజురాబాద్ రైల్వే లైన్ ను రిజెక్ట్ చేస్తే ఎంపీ సంజయ్ ఎం మాట్లాడటం లేదు. సంజయ్ కి చేతకాకపోయినా నేను పట్టుపట్టి హుజురాబాద్…