హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఎక్కడి వాడో వచ్చి మన ఊర్లలో మన బొడ్రాయి దగ్గర ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అభివృద్ధి చెయ్యలేదు అని అంటున్నారు. బ్రోకర్ గాళ్ళు, పని చేయని వారు వచ్చి మాట్లాడుతుంటే మీరు కూడా విని ఊరుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్నారు. ఈ ఊరికి రోడ్డు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే వేయించిన. చిన్న ఊరి వారికి కూడా పెద్ద బ్రిడ్జి వేయించిన. ఎంతమంది అని చూడలే వారు కూడా మనుషులే అని రోడ్లు, బ్రిడ్జి లు వేయించిన. ఎంతో మందికి హాస్పిటల్ వైద్యముకి సాయం చేసిన. వాళ్ళ నియోజకవర్గంలో రోడ్లు వేయించిన వారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. మధ్యలో వచ్చి మధ్యలో పోయిండు అని మాట్లాడుతున్నారు. ఎవడో బయటి వాడు వచ్చి మాట్లాడుతున్నరు. అయినా మీరు చప్పుడు చేయడం లేదు. ఈ రోజు వస్తున్న ప్రతిదీ నా రాజీనామా వల్లనే వస్తుంది. తీసుకోండి అందుకు కారణం అయిన నాకు ఓటు వేయండి అని కోరారు.