హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజలో ఉన్నా… ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో 166, రెండవ రౌండ్‌లో 192, మూడవ రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యతను సాధించారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 1,825 ఓట్ల లీడ్‌లో ఉండగా.. ఐదో రౌండ్‌లో కూడా ఈటల తన సత్తా చాటి 2,169 ఓట్ల…
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికు ఈ రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పాసులు ఉన్నా మమల్ని అనుమతించడం లేదంటూ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టి వెల్లడంతో వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు…
గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన…
గత 5 నెలలుగా సాగిన ఉత్కంఠకు నేడు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్‌ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిననాటి నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు హుజురాబాద్ కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు…
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఏక్ నిరంజన్‌గా మిగిలిపోయారా? ఇక చాలు అని బీజేపీ నేతలకు చెప్పేశారా? పోలింగ్‌కు మిగిలిన మూడు రోజులు ఆయన ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారు? ఈటలలో వచ్చిన మార్పేంటి? లెట్స్ వాచ్..! బీజేపీ వారిని సర్దుకోవాలని చెప్పారా? హుజురాబాద్‌లో ఈ నెల 30 పోలింగ్. 72 గంటల ముందే ప్రచారానికి ఫుల్‌స్టాప్. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఉపఎన్నిక…
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్తు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆత్మగౌరవం అంటూ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్…
బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని…
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. అధికార పక్షం టీఆర్ఎస్పై ఓవైపు బీజేపీ ఫిర్యాదులు అందిస్తుంటే.. మరోవైపు.. బీజేపీ గీత దాటుతోంది ఇవిగో ఆధారాలంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇక, ఇవాళ బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు.. 31-హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు.. రఘునందన్ రావు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని..…
ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వాటి ప్రచారాల్లో దూకుడు పెంచాయి. ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహ్యాలను ఎంచుకుంటున్నారు. ప్రచారంలో తమ దైన శైలితో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సర్వే సంస్థలు…
అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… యువత మీరే ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలి. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా మన యువత భయపడడం లేదు. 27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు. కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదు. చరిత్రలో మంచి రాజులు, చెడ్డ…