కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… ఈటల ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటి వరకు చెప్పలేదు. హుజురాబాద్ అభివృద్ధి పై ఇప్పటి వరకు ఈటల మాట్లాడటం లేదు. నీ సమస్య నీబాధ నియోజకవర్గం ప్రజల మీద రుద్దుతావ అని ప్రశ్నించారు. హుజురాబాద్ రైల్వే లైన్ ను రిజెక్ట్ చేస్తే ఎంపీ సంజయ్ ఎం మాట్లాడటం లేదు. సంజయ్ కి చేతకాకపోయినా నేను పట్టుపట్టి హుజురాబాద్ రైల్వే లైన్ సంక్షన్ చేపిస్తా… హుజురాబాద్ జమ్మికుంట ని కలిపి అర్బన్ డెవలప్ మెంట్ పెడతాం. గెల్లు గెలిచిన తరువాత హుజురాబాద్ జమ్మికుంట మధ్య మెడికల్ కాలేజీ పెడుతాం. రెండున్నర సంవత్సరాలనుండి కేంద్రం నుండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఈటల బాధలు వేరు అందుకే ఆపార్టీ కి వెళ్లిండు అని పేర్కొన్నారు.