హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… నేను మధ్యలో వచ్చి మధ్యలో పోలేదు. సమైక్య పాలనలో ఎన్ని అవమానలు భరించాం. పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఎక్కడ అడిగిన ఈటెల కు కేసీఆర్ ద్రోహం చేసిండు అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ఎమ్ వస్తుంది అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ప్రగతి భవన్ నుండి బయటికి వస్తాడు. నిరుద్యోగ భృతి వస్థలేదు. అడిగితే నన్ను పార్టీ నుండి బయటికి పంపాడు. వందల కోట్లు నా మీద నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈటల వల్ల మీకు గౌరవం పెరిగింది. ఇష్టం లేకపోతే ఎవరినైనా బంగాళాఖాతంలో కలిపే హక్కు ప్రజలకు ఉంటుంది. హుజురాబాద్ ఒక కురుక్షేత్ర సంగ్రామ జరుగుతుంది. కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవానికి ఈ ఎన్నిక. ఎన్ని వందల కోట్లు, దౌర్జన్యం బెదిరింపులు ఈ ప్రాంతం లొంగదు అని పేర్కొన్నారు.