Punjab: పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు.
Terrorist killed in Pulwama encounter: భారత సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామాలో గత రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. Also Read: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా కేఎస్ భరత్! అధికారులు తెలిపిన…
Jammu Encounter: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైన్యం మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈరోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో క్రిమినల్ రషీద్ కాలియాను హతమార్చారు. ఓ కాంట్రాక్టర్ ను చంపేందుకు వచ్చిన సమయంలో యూపీ ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేశారు. ఘటనా స్థలంలో అతని వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలైన రషీద్ కాలియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల కళ్లు గప్పి కరడుగట్టిన నేరస్తుడు పరారైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ హాలెట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నేరస్తుడు పోలీసులను నుంచి బయటపడ్డాడు. ఈ క్రూరమైన నేరస్తుడు నకిలీ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ ప్రజల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నడనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు భారత ఆర్మీ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం కుల్గామ్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జిల్లాలోని కుజ్జర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మరోవైపు రాజౌరీ జిల్లాలో గత మూడు రోజులుగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.
Baramulla Encounter: గత నాలుగు రోజులుగా జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. నలుగురు అధికారులు అమరులయ్యారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తూనే ఉంది. అయితే దట్టమైన అడవులు, గుహలు ఉగ్రవాదులకు రక్షణగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా శనివారం కాశ్మీర్ లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఆర్మీ అధికారుల, ఒక డీఎస్పీ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనాక్, డీఎస్పీ హుమాయున్ భట్‌లుగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నార్ల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. అయితే ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.