Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు భారత ఆర్మీ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అక్టోబర్ 26న ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్‌లో కుప్వారా సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని దళాలు భగ్నం చేశాయని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
Also Read: China: చైనాలో ఏం జరుగుతోంది..? రక్షణ, విదేశాంగ మంత్రుల తొలగింపు..
కుప్వారా పోలీసులు అందించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా మచల్ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ జరుగుతోందని పోలీసు ప్రతినిధి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు భారత సైన్యం తెలిపింది.