Baramulla Encounter: గత నాలుగు రోజులుగా జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. నలుగురు అధికారులు అమరులయ్యారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తూనే ఉంది. అయితే దట్టమైన అడవులు, గుహలు ఉగ్రవాదులకు రక్షణగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా శనివారం కాశ్మీర్ లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
Read Also: Petrol Diesel Rates in Pakistan: భారీ షాక్.. లీటరు పెట్రోల్ పై రూ. 26, డీజిల్ రూ.17 పెంపు
శనివారం బారాముల్లా జిల్లాలోని ఉరి, హత్లాంగా పార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులు, ఆర్మీ- బారాముల్లా పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ ప్రాంతంలో ఆర్మీ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది.
మరోవైపు అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. పీఓకే, ఇండియా సరిహద్దుల్లోని దట్టమైన అడవులు, కొండల్లో దాక్కున్న టెర్రరిస్టులు భద్రతా బలగాల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇప్పటికే ఈ ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌తో పాటు జమ్మూ పోలీస్ డీఎస్పీ హిమాయున్ భట్ తో పాటు మరో జవాన్ శుక్రవారం మరణించారు.