Terrorist killed in Pulwama encounter: భారత సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామాలో గత రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి.
Also Read: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా కేఎస్ భరత్!
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రదాడుల సమాచారం నేపథ్యంలో భద్రతా దళాలు పుల్వామా జిల్లా అరిహాల్ ప్రాంతంలోని న్యూకాలనీలో గురువారం ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతం అంతా కార్డన్ సెర్చ్ వేయబడింది. ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని గుర్తించి.. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉగ్రవాది మృతి చెందాడు. అతడి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాది ఏ సమూహానికి చెందినవాడో ఇంకా తెలియరాలేదు.
On specific intelligence input, a joint operation was launched by Indian Army & Jammu and Kashmir Police on the intervening night of 30 Nov-01 Dec 23 at Arihal, Pulwama. Cordon laid & contact established. One terrorist has been eliminated along with the recovery of weapon and… pic.twitter.com/4xrQOfg23s
— ANI (@ANI) December 1, 2023