ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగింది.
ఓ ఇద్దరు అల్లుళ్లు మాత్రం.. ఏకంగా కలెక్టరేట్ వద్దే ఆందోళనకు దిగారు.. తమ భార్యలను కాపురానికి పంపండి అంటూ.. టెంట్ వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.. అంతేకాదు.. తమ భార్యలను కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్న మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల రిలే నిరాహారదీక్ష ఆసక్తికరంగా మారింది.
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.. ముసునూరు మండలానికి వెళ్తున్న క్రమంలో టీడీపీ నాయకుల అదే మార్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ కారును అడిగించి పలువురు కార్యకర్తలు.. దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రంగాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, సొంగ రోషన్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు…
ఈ రోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఏలూరుకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ఆ అమ్మాయి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆకుల వెంకట నాగ…
సోమవారం ఉదయం వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ 17 స్కూల్స్ లో 16 స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లు కావడం. ఒక్క ప్రభుత్వ పాఠశాల ఈ లిస్టులో చేరింది. ఇక నేడు ప్రకటించిన ఫలితాలలో.. Also Read: VIrat Kohli Sunil Narine: కోహ్లీ…
Maganti Babu Press Note: ముఖ పరిచయం, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా నిలబెడతారు? అని ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఎవరైనా బీసీలు తమకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా? అని మండిపడ్డారు. 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా?…