TDP: ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీకి గూటికి మేయర్..
- ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్..
- వైసీపీకి రాజీనామా చేసిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్..
- ఈ రోజు టీడీపీలో చేరనున్న మేయర్ దంపతులు.. పలువురు కార్పొరేటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే మాజీ మంత్రులు కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మరోవైపు మున్సిపాల్టీ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలపై దృష్టి సారించింది టీడీపీ.. కొన్నింటిని ఇప్పటికే కైవసం చేసుకుంది టీడీపీ.. ఈ నేపథ్యంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏలూరులో బిగ్‌షాక్ తగలబోతోంది.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.
Read Also: Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O
Also Read
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఫలితా లు చవిచూసిన వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే ఏలూరు నగర మున్సిపల్ కార్పొరే షన్ మేయర్ షేక్ నూర్జహాన్.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె తన భర్త పెద బాబుతో కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.. నేడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు కూడా.. టీడీపీ గూటికి చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 2013లో టీడీపీలో చేరి అదే పార్టీ తరపున తొలిసారి మేయర్‌గా ఎన్నికైన షేక్ నూర్జహాన్, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.. ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారు మేయర్ దంపతులు.. ఇప్పటికే ఏలూరు వైసీపీ ఇంఛార్జ్ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేసిన విషయం విదితమే. మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్న నేపథ్యంలో.. ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం అయ్యే అవకాశాలున్నాయి.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!