ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ మద్యం అమ్ముతున్న వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. మధ్యాహ్నం హోమ్ డెలివరీ చేస్తూ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తులపై ఇటీవల సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి.
కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది.. దీంతో, వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా…
ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో నకిలీ జడ్జిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద సకిలీ జడ్జి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల చిరునామాలతో అతని దగ్గర కార్డులు ఉండడాన్ని గుర్తించారు పోలీసులు..
కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ రావడంతో కూల్ డ్రింక్స్ అమ్ముకునే చిరు వ్యాపారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. రూ.66 కోట్ల లావాదేవీలు జరిగాయని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు అడ్రస్‌కు వచ్చి.. షాపుకు చూసి కంగుతిన్నారు. ఎంక్వయిరీ చేయగా కూల్ డ్రింక్స్ వ్యాపారి నెంబర్‌పై వేరే వారు లావాదేవీలు నడిపినట్టు తేలింది. నెలలు గడుస్తున్నా పరిష్కారం లేకపోవడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి…
ఏలూరు నగరంలో శనివారం రాత్రి ఒక జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది. ఆ దుకాణంలో దొంగతనం తీరు వ్యాపారులనే కాదు స్థానికులను సైతం భయపడే విధంగా ఉంది. షాపుకు వెనుక వైపున పాడుబడిన భవనం ఉండడంతో ఇది గమనించిన దొంగలు గోడకి కన్నం వేసి ఉన్నదంతా దోచేశారు..
ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Murder : తల్లి లేకపోవడం తండ్రి హత్యకు గురవడంతో మైనర్లు అయిన వారి కుమార్తెలు అనాథలయ్యారు. ఏలూరుకు చెందిన వెంకటకనకరాజుకు ముగ్గురు ఆడపిల్లలు ఆయన భార్య ఎనిమిదేళ్ల కిందట మరణించింది. అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆయనే చూస్తున్నారు. ఏలూరులోని రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి కింద కన కరాజు హత్యకు గురయ్యారు. పెద్ద కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదని కక్ష గట్టిన నాని అనే యువకుడు ఆయనను కత్తితో పొడిచాడు. కనక రాజు మృతదేహానికి సర్వజన…
తల్లి మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులను అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తండ్రి కథ విషాదంగా ముగిసింది. ఏలూరులో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి కేసును విచారణ చేపట్టిన పోలీసులు దారుణ వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని తండ్రి హెచ్చరించడంతో.. కక్ష పెంచుకుని తండ్రిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు ఓవర్ బ్రిడ్జి కింద 39వ పిల్లర్ వద్ద నివాసం ఉంటున్న షేక్ వెంకట కనకరాజు భార్య…
Suspects : ఏలూరులో ముగ్గురు యువకులుతుపాకీతో పోలీసులకు పట్టుబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు తుపాకీ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు, ఎలాంటి నేరానికి పాల్పడనున్నారు అనే కోణాల్లో వారిని విచారణ చేస్తున్నారు. ఏలూరు టూటౌన్ కొత్తపేటలో గస్తీ నిర్వహిస్తున్న మహిళా ఎస్సై, సిబ్బందికి రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారు కనిపించింది. లోపల ముగ్గురు యువకులు ఉండటంతో వారిని వివరాలు అడిగారు. వారు చెప్పిన సమాధానాల్లో స్పష్టత లేకపోవడంతో కారంతా గాలించగాతుపాకీ దొరికింది. వెంటనే ఆ…