కోటగిరి శ్రీధర్... వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్చందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా.... అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం.
గత ఎన్నికల్లో టిడిపి తరపున ఏలూరు ఎంపీ టిక్కెట్ దక్కించుకుని గెలిచారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. కడపకు చెందిన పుట్టా.... ఏలూరుకు కొత్త కావడంతో... ఎన్నికల్లో సీనియర్ లీడర్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడే కొత్త నేతకు చుక్కలు చూపించిన కొందరు నేతలు ఇప్పటికి అదే పంథాలో ఉన్నారట. కొత్తకావడం, చిన్నాచితక పనులకోసం స్థానిక నాయకులపై ఆధారపడాల్సి రావడంతో ఆయన చుట్టూ చాలామంది చేరిపోయినట్టు చెప్పుకుంటున్నారు.
ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. క్రీడల్లో మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన కోచ్‌లు కీచకులుగా మారారంటూ క్రీడాకారిణులు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వేదింపులు నిజమేనని నిర్ధారించారు. Also Read: Kurnool District: బీజేపీలో చేరిన కొడుమూరు మాజీ ఎమ్మెల్యే! ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఉన్న శాయ్ హాస్టల్లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు…
ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో టార్గెట్ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొంత సమస్య ఏర్పడిందని, లక్ష్యానికి మించి దాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు వద్ద ప్రతిదాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి మాటలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి ప్రధాని…
కొల్లేరు వాసులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే నమ్మకం పెరుగుతుంది. కొల్లేరు ప్రాంత జిరాయితీ భూముల యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొల్లేరు వివాదానికి కారణమవుతున్న అంశాలపై 12 వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార సంస్థకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనే ఆశతో కొల్లేరు వాసులు ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5వ కాంటూరు…
ప్రజల భద్రత మరింత పెంచేందుకు ఏలూరు పోలీసుల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై, నిర్మాణస్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దొంగలపై మాత్రమే కాదు ఊరేగింపులు, వేడుకల వద్ద అల్లర్లకు పాల్పడే ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్ల సాయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే చోదిమెళ్ల వద్ద సిమెంటు లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న రమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతి వేగం,…
ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
కోళ్ల ఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలిందని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, ఈ వార్తలపై సీరియస్గా స్పందించారు ఏలూరు జిల్లా కలెక్టర్.. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోందన్న ఆమె.... అయితే, జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో.. భారత్లోనే ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ప్లు కేసు కూడా బర్డ్ నుండి మనుషులకు రాలేదని స్పష్టం చేశారు.