Maganti Babu Press Note: ముఖ పరిచయం, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా నిలబెడతారు? అని ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఎవరైనా బీసీలు తమకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా? అని మండిపడ్డారు. 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా?…
తనతో ఒక్క మాటైనా చెప్పకుండా అభ్యర్థిత్వం మార్చడం బాధాకరమని మాగంటి అంటున్నట్లుగా సమాచారం. మాగంటి వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, తనకు అత్యంత ఆప్తుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
ఏలూరులో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. నర్సాపురం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో బీజేపీ అధికారంలో వస్తుంది అనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం కోసం కేంద్రం నిధులు ఇస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచనలో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ మోడీ చేతుల్లోకి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనగా 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. అయితే, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. పలు చోట్ల ట్రాఫిక్ను మళ్లించారు అధికారులు..