CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించి.. రాష్ట్రాన్ని చుట్టేశారు.. ఇదే సమయంలో రోడ్‌షోలు, బహిరంగ సభల్లోనూ ప్రసంగించారు.. ఇక, ఇప్పుడు రోజుకు మూడు జిల్లాల చొప్పున విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. 8 రాష్ట్రాల్లో 16 మందికి నోటీసులు
ఈ రోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం.. ఈరోజు ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలో సభకు హాజరవుతారు.. సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. ఇక, అక్కడ నుంచి ఏలూరు వెళ్లనున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ ప్రచారాన్ని విస్తృతం చేసింది.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. అవసరం అయిన చోట రాష్ట్ర నాయకులు వాలిపోతున్నారు.