Eluru: మా భార్యలను కాపురానికి పంపండి.. కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల దీక్ష..
- ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల రిలే నిరాహారదీక్ష.. తమ భార్యలను కాపురానికి పంపాలని డిమాండ్..
- తమ భార్యలను కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్న మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru: తమ భార్యలను కాపురానికి పంపాలంటూ.. అత్తింటికి వెళ్లే అల్లుళ్లను చూశాం.. మరీ అయితే.. నలుగురిని పిలిచి పంచాయితీ పెట్టే వారు లేకపోలేదు.. అయితే, ఓ ఇద్దరు అల్లుళ్లు మాత్రం.. ఏకంగా కలెక్టరేట్ వద్దే ఆందోళనకు దిగారు.. తమ భార్యలను కాపురానికి పంపండి అంటూ.. టెంట్ వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.. అంతేకాదు.. తమ భార్యలను కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్న మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల రిలే నిరాహారదీక్ష ఆసక్తికరంగా మారింది.. తమ మామ అయ్యంగార్ ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా.. తమను వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ అల్లుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యలను ఇంటి వద్ద ఉంచుకుని.. తిరిగి తమపైనే కేసులు పెడుతున్న మామపై చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలంటూ అల్లుళ్లు వి. పవన్, పీబీ శేషసాయి డిమాండ్ చేస్తున్నారు.
Read Also: IAS officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఈ సారి ఎంతమందంటే..
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
మా సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు పవన్.. ఆయన ఎస్పీని కలవమని సూచించారు.. ఎస్పీ గారు డీఎస్పీగారికి చెప్పారు.. కానీ, మా మయ్య నా భార్యను కాపురానికి పంపించడం లేదు.. నా కూతురును చూపించడం లేదు.. ఫోన్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. చిన్నపాపకు నాపై నెగిటివ్‌గా చెబుతున్నారు.. బర్త్‌డే విషెస్ చెప్పినా.. నెగిటివ్ ఆడియో మెసేజ్‌లు పెట్టిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. నాకు వేరే దారిలేకే.. ఇలా దీక్షకు దిగినట్టు చెబుతున్నారు పవన్..
కలెక్టరేట్‌కు ఎదురుగా ఓ టెంట్ వేసిన పవన్, శేషసాయి.. అందులోనే రిలే నిరాహార దీక్షకు దిగారు.. ఇక, తమ డిమాండ్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు..
* మా భార్యలను కాపురానికి పంపించాలి..
* కన్న కూతురిని తండ్రికి చూపించాలి..
* కూతుళ్లను కాపురానికి పంపించకుండా అల్లుళ్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి..
* శాడిస్ట్ మామయ్య బీకే శ్రీనివాస రామానుజ అయ్యంగర్‌పై చర్యలు తీసుకోవాలి.. ఇట్లు మోసపోయిన అల్లుళ్లు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు..
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!