ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పోలీసు అధికారుల నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించింది. ఈ ఘటనపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూటమి ఫిర్యాదు చేసింది. ఇక కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశ రాజధానిలో ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి, పోలీసుల నుంచి అనుమతి లభించినట్లుగా ఆప్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, డెరెక్ ఓబ్రెయిన్, తిరుచ్చి శివ, ఫరూక్ అబ్దుల్లా, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్, హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, రాజారామ్ సోరెన్ సహా భారత కూటమి నాయకులు, ఇతరులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: RCB VS KKR: ఆర్సీబీ పైన షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతమ్ గంభీర్ .!
ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 21న ఢిలీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకముందు ఇదే కేసులో తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ విచారణకు మాత్రం ఆయన హాజరుకాలేదు. మరోవైపు అరెస్ట్ చేయకుండా జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టును కేజ్రీవల్ ఆశ్రయించారు. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. అరెస్ట్ ఆపలేమని తేల్చి చెప్పింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి గురువారం కోర్టులో హాజరు పరచగా.. ఏప్రిల్ 1 వరకు.. అనగా నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగింది.
ఇది కూడా చదవండి: karnataka: జేడీఎస్ అభ్యర్థుల ప్రకటన.. కుమారస్వామి ఎక్కడి నుంచంటే..!
మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌ను అమెరికా సహా పలు దేశాలు తప్పుపట్టాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా తప్పుపట్టింది. ఇతర దేశాల జోక్యంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ఇదిలా ఉంటే ఈడీ కస్టడీలో కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారంటూ ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు.
Permission has been received from the Election Commission and Police for the INDIA bloc rally to be organised at Delhi's Ramlila Maidan on 31st March against the arrest of Delhi CM Arvind Kejriwal. INDIA bloc leaders including Mallikarjun Kharge, Rahul Gandhi, Sharad Pawar,…
— ANI (@ANI) March 29, 2024