దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మొత్తం ఏడు విడతలలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే లోకసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన సంఘటన ఇదివరకే మనకు వేదితమే. ఇకపోతే తొలి దశ లోకసభ ఎన్నికల సమయం దగ్గర పడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. నేటి సాయంత్రం ఐదు గంటలకు స్పీకర్లు, మైకులను ఇక ఆపేయాల్సిందే. Also Read: Ram Mandir : అయోధ్యకు…
భద్రాచల శ్రీరామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారం అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్క్రీనింగ్ కమిటీ ఉంది.. ఈ కమిటీ నిర్ణయం ఎలా ఉంటే అదే ఈసీఐకి నివేదించాము.. ఈసీఐ నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది అని వికాస్ రాజ్ తెలిపారు.
అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు చేస్తోంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్, కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రేపు జరిగే శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల శ్రీ రాముని కళ్యాణ ప్రసారాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
Election Commission: దేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడుతున్నాయి. లోక్సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే రికార్డు స్థాయిలో ఇంత మొత్తం నగదును ఇదే తొలిసారని ఎన్నికల సంఘం చెబుతోంది.
2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కొన్ని రాజకీయ పార్టీల ప్రభావంతో పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో ఇప్పటికీ దేశంలోని అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున రాజకీయ సభలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే.. ఎలక్షన్స్ కమిషన్ సంబంధించిన అధికారులు ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకొని కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇక అసలు విషయం లోకి వెళ్తే.. Also read: Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు నేడు…