Voting Rule: తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్లను పోలింగ్ స్టేషన్‌కి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదే తరుణంలో పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ అధికారి ముందు తన గుర్తింపును నమోదు చేసుకున్న తర్వాత కూడా ఓటేయడానికి నిరాకరించిన ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరని ఓటింగ్ రూల్స్ తెలియజేస్తున్నాయి.
నోటా కింద ఈ హక్కుని ఓటర్లు కలిగి ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 రూల్ 49-O కింద ఈ హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ సెంటర్‌కి చేరుకున్న తర్వాత కూడా ఓటర్లు ఈ హక్కుని వినియోగించుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. NOTA (నన్ ఆఫ్ ది ఎబోవ్) అనేది ఏ అభ్యర్థి నచ్చకపోయినప్పుడు ఓటర్ ఎంచుకునే ఒక ఆప్షన్. తమకు ఏ అభ్యర్థిపై విశ్వాసం లేదని చెబుతుంది. అయితే ‘ఓటు తిరస్కరణ’ అనేది పోలింగ్ ప్రక్రియను పూర్తిగా విస్మరించడానికి అనుమతిస్తుంది.
49-O నిబంధన ప్రకారం.. ఒకసారి ప్రిసైడింగ్ అధికారి ఓటర్ ఆధారాలను ధృవీకరించిన తర్వాత, బూత్‌లో ఓటేయడానికి నిరాకరిస్తే, అధికారి ఫారం 17 Aలో ఓటర్ సంతకం లేదా, బొటనవేలు ముద్రకు వ్యతిరేకంగా ఈ విషయాన్ని పొందుపరచాలి. ఇది కొత్తగా సంక్రమించిన హక్కు కాదని, అయితే ఓటర్‌కి దీనిపై పెద్దగా అవగాహన లేదని ఈసీ అధికారులు చెబుతున్నారు.
Read Also: Mahesh Babu : మహేష్ బాబు వెళ్లింది దుబాయ్ కి కాదా..అక్కడకు ఎందుకు వెళ్లాడు?
49-O నిబంధన బోగస్ ఓటింగ్‌ని పర్యవేక్షిస్తూనే, అభ్యర్థులందరిని తిరస్కరించే అవకాశాన్ని కల్పిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం అంతటా ఇతర కారణాల వల్ల 1389 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నియమం ప్రకారం.. ఒక వేళ ఓటర్ తన ఎలక్టోరల్ రోల్ నంబర్‌ని అనుసరించి, అలాగే తన సంతకం లేదా బొటనవేలు ముద్రను ఫారం 17Aలో సక్రమంగా నమోదు చేసిన తర్వాత, ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే, ఓటు వేయమని బలవంతం చేయకూడదు. ఫారంలో, ఓటర్ల రిజిస్టర్‌లో సంతకం చేసిన తర్వాత ఓటు వేయకుండా వెళ్లిపోవాలనుకునే ఓటర్లకు ‘అండర్ రూల్’ స్థానంలో, ఓటు వేయకుండా వదిలేయబడుతుంది లేదా ఓటు వేయడానికి నిరాకరించాడని చేర్చబడుతుంది.
ఒక వేళ ఈవీఎంలో ఓటేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఓటేయడానికి ఓటర్ నిరాకరిస్తే ఆ సమయంలో ప్రిసైడింగ్ అధికారి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారు. ఒకవేళ ఓటర్ ఓటేయడానికి బటన్ నొక్కితే, ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్‌ని రీబూట్ చేయడం, VVPATని డిస్‌కనెక్ట్ చేయాలి. బిజీ ఇండికేటర్ ఆఫ్ అయిన తర్వాత పవర్ స్విచ్ ఆన్ చేయాలి.