నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసి ప్రధానపార్టీల ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగో విడతలో వున్నాయి… అంటే మే 13న పోలింగ్ జరగనుంది.. రోజు రోజుకు ఉత్కంఠగా ప్రచారాలు జరుగుతున్నాయి.. టీడీపీ, జనసేన పొత్తు పై ప్రచారం చేస్తున్నారు.. జనసేన ఇప్పుడు ఏపీలో…
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మెజార్టీ పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్లే అది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు, తాను చేసిన అభివృద్ధి తన విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని…
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు తిరుగుతూ తమకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. సంక్షేమం, అభివృద్ధి పథకాలను తీసుకొస్తామంటూ చెబుతూ ముందుకెళ్తున్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వీరంతా పసుపు కండువా కప్పుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న ..రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్‌లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ప్రచారం ఉధృతం చేశారు. 2014లో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో నిర్వహిస్తున్నారు.