Thota Narasimham: రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో నిర్వహిస్తున్నారు.
Read Also: Dadisetti Raja: భర్తకు మద్దతుగా భార్య.. తండ్రికి తోడుగా తనయుడు ఎన్నికల ప్రచారం
తోట నరసింహంకు మద్దతుగా కూతురు ప్రసూన, కోడలు శ్రీనిధి జగ్గంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. గతంలో నరసింహం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, తిరిగి తోట నరసింహంకు అవకాశం ఇస్తే మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మరోసారి అభివృద్ధికి ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేలా అందరూ ఆశీర్వదించాలని కోరారు. వారి ప్రచారంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు