తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. స్వచ్చందంగా వైస్సార్‌సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో యాంకర్ శ్యామల ఈ రోజు 51వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేశినేత శ్వేత తెలిపారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బాపులపాడు మండలం కె. సీతారామపురం, కొయ్యూరు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరువూరు పట్టణం 17వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. గడపగడపకు తిరుగుతూ మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.