Yarlagadda Venkat Rao: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు తిరుగుతూ తమకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. సంక్షేమం, అభివృద్ధి పథకాలను తీసుకొస్తామంటూ చెబుతూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా.. గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గన్నవరం మండలం బల్లిపర్రు, తెంపల్లి గ్రామాల్లో యార్లగడ వెంకట్రావు ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు ప్రజాదరణ కూడగట్టుకుంటున్నారు. ప్రతి గడపను సందర్శిస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
Read Also: Chandrababu : పింఛన్ల పంపిణీపై సీఎస్ తీరు సరికాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశ, దిశ మారాలన్నా, మరో హైదరాబాద్ నిర్మించాలన్నా , ఐటీ కంపెనీలు రావాలన్నా, పడిపోయిన భూమి విలువలు పెరగాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం చారిత్రాత్మక అవసరమని ఆయన పేర్కొన్నారు. తనను గెలిపిస్తే రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మొదటి స్థానంలో పెడతాననని అన్నారు. రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసీ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బాలశౌరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ముద్రబోయిన వెంకటేశ్వర రావు, ఎంపీ బాలశౌరి కుమారుడు పాల్గొని యార్లగడ్డ వెంకట్రావు, బాలశౌరిలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.