ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఎన్నికల పోలింగ్ కు అతి కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడును పెంచారు.. ఇక కొందరు అభ్యర్థులు మాత్రం తమకోసం ప్రచారం చెయ్యాలంటు సినీ తారలను దించుతున్నారు.. తాజాగా హీరోయిన్ నమిత కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చింది.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరపున ఆమె ప్రచారం చేశారు.. ఆయన టీడీపీ,…
ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని.. అవకాశం కల్పించండని, మీలో ఒక్కరిగా మీ అడుగుజాడల్లో నడుస్తూ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. గురువారం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, ఉత్తరపల్లి, చెర్లోపల్లి, కుమ్మరపల్లి, చేరెడ్డిపల్లె, చిన్నారికట్ల, పెద్దారికట్ల గ్రామాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పెండ్యాల గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ జెండాలతో ఉప్పొంగింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్‌కి, నాన్‌లోకల్‌కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35, 42వ డివిజన్లలో తన తండ్రి కేశినేని నాని తరఫున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాగిడి లక్ష్మారెడ్డితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్‌ఎస్ అభ్యర్థిని నివేదిత పాల్గొన్నారు.
దేశంలో కుల, మతాలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకీ, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
న్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు ఆయనను పూల వర్షాలతో ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జలదంకి మండలం కొత్తపాలెం, సోమవరప్పాడు, కృష్ణపాడు, బోయలపాడు, వేములపాడు, కోదండరామపురం పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.