నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పల్లె జనం వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ కొడుకు, కుమార్తె మాట్లాడుతూ.. పుణ్యభూమి మీద ప్రేమతో విలాసవంతమైన జీవితాన్ని వదిలి, మీ సేవకై వచ్చిన కాకర్ల సురేష్ ని ఆశీర్వదించాలని కోరారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు.
Read Also: Dil Raju: Deverakonda: మొన్న అన్నారు.. ఇప్పుడు చేసి చూపించారు
ఇక, సీతారాంపురం మండలం పబ్బులేటి పల్లి పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన యువత ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేస్ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానన్నారు. అదే విధంగా ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు.
Read Also: Loksabha Elections : సూరత్, ఇండోర్, ఇప్పుడు పూరీ.. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన కాంగ్రెస్ అభ్యర్థి
మరో వైపు ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం విరువూరు పంచాయతీలో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ఇంటింటా తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికలలో తన భర్త ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే, వింజమూరు మండల హెడ్క్వటర్ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన సుమారు 10 కుటుంబాలు కాకర్ల సురేష్ తమ్ముడు కాకర్ల సునీల్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, కలిగిరి మండలం క్రాకుటూరు పంచాయతీలో కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.