Kakarla Suresh: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వీరంతా పసుపు కండువా కప్పుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న ..రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అలాగే, ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ప్రముఖ వ్యాపార వేత్త తమ్ముడు చేజర్ల రాములు రెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా అప్పసముద్రంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా కాకర్ల సురేష్‌ను రాములు రెడ్డి తన నివాసానికి ఆహ్వానించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి తో పాటు ఉదయగిరి టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు జనసైనికులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, ఉదయగిరిలో కాకర్ల సురేష్ గెలుపు కోసం టీడీపీ వడ్డెర సాధికార సమితి జిల్లా కన్వీనర్ బెల్లంకొండ శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. దుత్తలూరు మండలం బైరవరం తురకపల్లి గ్రామాలలో శ్రీనివాసులుతో కలిసి పలువురు పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను గెలిపించాలని వారు ప్రజలను అభ్యర్థించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయగిరిమండలం దాసరిపల్లి వడ్లమూడిపల్లి, అప్పసముద్రం తిరుమలపురం, చిన్నవారి చింతల గుడి, నరవ దుంప వారి పల్లి, వెంగళరావు నగర్, గండిపాలెం పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ కరపత్రాలు అందజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కాకర్ల మాట్లాడుతూ.. మీ గ్రామాల్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని, ఓటు వేసి ప్రశ్నించాలని, జవాబు లేకపోతే పక్కన పెట్టాలని వినూత్న రీతిలో కాకర్ల సురేష్ ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి పల్లె జనం కాకర్ల సురేష్ కోసం ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక ఆయన వెంట నడిచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, మండల కన్వీనర్ బయన్న గానుగపెంట ఓబుల్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.
ఉదయగిరిలో కాకర్ల సురేష్ ప్రచారం తిరునాళ్లను తలపిస్తోందని అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఎర్రటి ఎండలో కాకర్ల ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పల్లె ప్రాంతాలను ప్రగతి వైపు నడిపిస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయగిరిమండలం దాసరిపల్లి వడ్లమూడి పల్లి అప్పసముద్రం తిరుమలపురం చిన్నవారి చింతల గుడి నరవ దుంప వారి పల్లి వెంగళరావు నగర్ గండిపాలెం పంచాయతీలలోని ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలకగా.. యువత బైక్ ర్యాలీ చేపట్టారు. గ్రామాల్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కాకర్ల హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను.. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాగా, కాకర్ల గెలుపు కోసం వింజమూరు టీడీపీ మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థికాకర్ల సురేష్ ..నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కోరారు.
మరోవైపు, ఈ ఎన్నికలకు రూపొందించిన ఉమ్మ మేనిఫెస్టో అద్భుతం అంటూ వింజమూరు వరికుంటపాడు కలిగిరి మండల కేంద్రాలలోని పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇదిలావుంటే… ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మస్తానమ్మ తన కుమారుని గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గురువారం కలిగిరి మండలం పరిధిలోని చిన్న అన్నలూరు పంచాయతీ, ఎస్సీ కాలనీ, ఎస్ టి కాలనీ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారామె. ఇక, కాకర్ల సురేష్ భార్య ప్రవీణ జలదంకి మండలం చామాదల గ్రామపంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తన భర్తను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. మరోవైపు, కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ కూడా తన బావ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కొండాపురం మండలం కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారామె. తెలుగుదేశాన్ని గెలిపిస్తే ఉదయగిరిని సిరుల గిరిగా మారుతుందని అన్నారు సురేఖ. ప్రచారానికి వచ్చిన సురేఖకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.