చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు.
మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబుని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నా రాంబాబు సతీమణి దుర్గా కుమారి అభ్యర్థించారు.
కాకినాడ జిల్లా తునిలో తండ్రి దాడిశెట్టి రాజా గెలుపు కోసం తనయుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సతీమణి దూలం వీర కుమారి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.