Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్‌గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బీజేపీ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు నేటికి 9 రోజులైంది. అయినా కూడా ఈనాటికి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు. హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం గడిచినా, ఇంకా సీఎం ఎవరనే క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ ‘‘మహాయుతి’’ కూటమి అఖండ విజయాన్ని సాధించింది.
Maharashtra: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్‌లైన్ పెట్టుకుంది బీజేపీ. కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ప్రకటించింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 05 సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఐకానిక్ ఆజాద్ మైదాన్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.